మిస్సవుతున్న బొడెద్దులకి...
ఆకాశం
జీవ నది కాదు
పొద్దున్నే
తెల్ల బట్టల్ని
సాయంత్రం
నల్లబట్టల్ని
ఆరెసుకునే
నది రేవమ్మటి ఒక ఇసుక మైదానం
ఒడ్డంచున అక్కడక్కడ మిగిలిన కొండలు
అంతరిస్తున్న
చాకిరేవులు
లేని గుండ్రటి బోడెద్దులు కళ్ళతో చూడ్డం తప్ప
మిగిలిందేం లేదు
(బోడెద్దు అంటే గాడిద)
(17-6-13)
Comments
Post a Comment