ఏటి మాట
నా చివరి కోరిక ఆకుల సంచిలో నా శవ పేటిక కుట్టుకోవాలని జన్మజన్మలకి చావుకి మళ్ళీ పుట్టుకనివ్వాలని తొలకరి ఆకులకంటిన మట్టి శ్వాసలా... ఆకులకి అటు ఇటు సూర్యుడు చంద్రుడు నిదురించే నా కళ్ళలోని చీకటి చూపుల ధూళి వెలుగు నుండి ఆవిష్కరిస్తున్న వైతరణి నది పల్లకీ బోయిల్లా... పల్లకీ వెళ్ళిపోయినా బోయీల పాట గాలిలో సదా పరివ్యాప్తి చెందుతుంది *** అర్ధ రాత్రి ఒంటరిగా ఒడ్డున కూర్చోండి పడవ రేవు వెన్నెల వాటి మనసులో అవి పాడుకుంటూ ఒకటితో వొకటి లంగరేసుకుంటాయి ఈ కలయిక ఆత్మ సమయం దేహం అందుకే సూర్యాస్తమయం ముందే దహన సంస్కారాలు చెయ్యాలేమో! అదీ యేటి ఒడ్డున!! (31-5-13)