మాలి



కొన్ని అక్షరాలు

కొన్ని విత్తనాల్ని జల్లాను

వాటి పై

గుప్పెడంత  నీటి గింజల్ని రాల్చాను


కొన్ని కాగితపు పడవల్లో పయనించాయి

కొన్ని అరికాలు కింద 

తలపై

కడుపునిండా 

నీడనిచ్చాయి

ఇక 

ఈ తోట కబుర్లు 

అంతటా పరిమళిస్తాయి

ఇల్లు కదలాల్సిన

పనిలేదు

(16-6-13)

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు