రెసైటింగ్ ఆన్ ఇన్సైడర్స్ ఆంతాలజి



చూపుడు  వేలునుండి  దూసుకు వెళ్ళిన గోలి, అందులోని సీతాకోక 

చిలుకలు,తూనీగలు,

బోల్డన్ని రంగులు

వాటి వెంటే మిత్రులతోకేరింతలు,కనుచూపు వేగంతో కాలాన్ని ఆడించే 

రుతువు:బాల్యం


కాలం తో మారడం, సాధించలేని వాటి గూర్చి 

చెట్టు కింద బెంచి పైన, బీఛ్ కి వీపు చూపిస్తూ వాహనాల్ని 

లెక్కెట్టడం,పిచ్చాపాటి   గతాన్ని తోడుకోవడం:ఎదగడం

ఇంతలో అల నీడల్ని  ఒడ్డునుండి సంద్రంలోకి లాక్కు 

పోతుంది,సూర్యుడు,చంద్రుడు రోజూ మునుగుతున్నట్టే!

(30-5-13)

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

పిల్లల చెట్టు

గూళ్ళ రెక్కలు