విరహం ఉర్ఫ్ తన్ హాయి
ఆమె చీరలోని గంజి బిరుసు
రాత్రి వెన్నెల్ని
మల్లెలుగా చేస్తుంది
ఆమె చీరంచుల్ని
సరిచేస్తూ పాదాల చెంత కూర్చుంటా
ఆమె కొంగుసరిచేస్కుంటూ
నా వొంక చూడకుండానే
గుండ్రంగా తిరుగుతూ
ఆకారానికి చీరెని ఆవరణగా చుట్టేస్తూ...
ఆ..., సరిపోయిందంటూ ...
గొయ్యి మగ్గానికి భూమి రంగులద్దుతుంది
ఈ మధ్యన
వెసులుబాటు పుణ్యమా అని
ఆకృతికి
సల్వార్ కమీజ్ అల్లుకు పోయింది
నూలు చీరలు కట్టడం లేదు
అవి బీరువాలో
ముడతలు పడనిబెంగతో
పొద్దున్న
మేడ మీద
గాలికి ఎగిరిపోకుండా
గంజితొ తడిసిన చీర
అంచుల్ని అంటిపెట్టుకున్న
రాళ్ళు లేవు
తడిమరకలు లేవు
పగలనుకుంటాను...
ఓ మోస్తరు
యెడబాటుకు
ఇది కారణం కావచ్చని
రాత్రి
ఛ...
ఇంక
నిద్ర లేమి
రాక ఛస్తుందా!
(18-6-13)
( `·.·´¨)
ReplyDelete`·.¸(¨`·.·´¨)
(¨`·.·´¨) ¸.·´
`·.¸.·´
thanks sky
ReplyDelete