చేప నేత్రం
చేపలు
నీటి గాలి పటాలు
నేల మీద రాలుతున్న పండుటాకుల్లా
నీళ్ళకి రంగులద్దుతున్నట్టు ఈదుతుంటాయి
ఆకాశాన్ని నిద్రించని చేప కళ్ళతో నే చూడాలి
రాలే తోకచుక్క
గాలి బుడగై చిట్లుతుంది
వైతరణి దేహంలో ప్రవహిస్తుంది
(20-6-13)
Comments
Post a Comment