కొట్టేసిన చెట్టు మనస్సు మళ్ళీ చిగురించినట్టు మొలక ప్రార్ధనా గీతం ప్రతిధ్వనిస్తుంది మనిషి మతంలోని రక్తహింస గుండె మారదేంది! అల్లా దేవుడా యేసు!! ఆకుపచ్చ నేలకోక యెరుపెక్కుతోందయ్యా సాములు మీ గుడి మెట్లమట్టిని మీ నింగి పాదాల కాడైన పెట్టుకొండ్రి మీకు దండంపెడతా నా విత్తు మొలకెక్కక ముందే బొందలో కలవదన్న భరొసా అన్నా మిగుల్తది మీ ఆశీర్వాదముంటది గీ మట్టికి సెట్టు సుప్రభాతం పొద్దుగాల నమాజ్ శుభొదయ పాట మీమీదొట్టు (13-4-13)
భూమి తిరుగుతునప్పుడు దాని చుట్టూ అల్లుకున్న గాలి చప్పుడు చేరువలోనే వున్న గ్రహాంతర వాసుల నిశబ్ధ ఘోష పర్దా చాటున ఆమె కళ్ళ మౌన కబూల్ కనురెప్పల చెరసాలలొని నా కనుపాప కబూల్ సుహాగ్ రాత్ చూపుల సొరంగ మార్గం (12-5-13)
నడుస్తున్న పాదాలు ఆగి కట్ట మీద గండి మైసమ్మకు చేతులు జోడించాయి అన్నీ ఇళ్ళలొని దేవుడి పటాలు అక్కడె కొలువైయ్యాయి అమ్మ పోయినప్పుడు అక్కడి ప్రమిదని తెచ్చి దీపం వెలిగించా అన్ని దినాలు వెలిగింది (14-2-13, గాంధినగర్ చెరువు కట్ట)