Posts

Showing posts from September, 2012

నేకెడ్ ఏప్

వెంట్రుకలు రాల్చుకుంటూ ఎదిగిన వాళ్ళం! ప్రకృతిలోని వైవిథ్యాన్ని ఎలా మిగుల్చుతాం!! చనిపోయిన వారి ఆత్మ శాంతికి చేసుకున్న శిరోముండనంలా!!!

పొద్దు

ముఖ చిత్రం వేస్తుంటే కుంచె నిండా రంగులు పర్చుకుంటాయి చీకటిలో నుండి పొడుచుకొచ్చిన వెలుగు  ఆకాశాన్ని కొలిమిలా మార్చినట్టు...

పహరా

ముసలివాళ్ళ చుట్టూ పచ్చికలో గోటీబిళ్ళ దాగుడుమూతలు యుథ్థాలాటలు గాలిపటాల్ని ఎగరేస్తున్న  పిల్లలు జీవితపు సరిహద్దు గడియారపు ముల్లు గుచ్చుకున్నట్టున్న గుట్టమీద బురుజు రోజురోజుకూ కుంచించుకుపోతున్న గుట్ట (బడంగిపేట బురుజు)

మంచె

Image
ఇంటిముందు పొద్దుతిరుగుడు పూలు మా దినచర్య చుట్టూ తిరుగుతూ...  మేము వాటిని కావలి కాస్తూ.

గువ్వ గూడు

గూళ్ళూ ఖాళీగానే మిగులుతాయి జీరెండిన స్వర పేటికలా మళ్ళీ మధుమాసంలో అదే కొమ్మకు పూసిన మరో గూడు కలలను కనే తీగ పూల గువ్వ  నీడలా...