గూళ్ళ రెక్కలు
ఒకే గూడుకి
రెండు అరలు
కిందది గిజి గాడికి
పైది
గిజికి
సహవాస గాలికి
ఊగే ఉయల పందిరి.
నేల రాలిన
చుక్క
బావి
పైన తుమ్మ కొమ్మలకి
అంటిపెట్టుకున్న
గూళ్ళ వూరు
పుడమి తివాచిని
ఎగరేసుకుపోతున్న రెక్కల్లా.
మూనిమాపు వేళ
చెట్టు
ఓ సంధ్యారాగం
అప్పుడే వచ్చివాలే
తెల్ల కొంగలు
ప్రేక్షకులు
తుమ్మ ముల్లు
పక్షికూతలు
రేయింబవళ్ళని
జతకలిపి పలికించే
బాన్సురి వయలీన్ల
జుగల్ బంది
(29-12-12,కంసానిపల్లి,మహబూబ్ నగర్ జిల్లా)
అద్భుతంగా వర్ణించారు నా యింటినీ పరిసరాలనూ సత్య జీ ...గిజిగాడు ...
ReplyDeletewww.nutakki.wordpress.com (kanakaambaram)
Thanks andi
ReplyDeletewonderful description
ReplyDeleteRamesh gaaru thanks ,and i wish u happy new year
ReplyDelete