Posts

Showing posts from August, 2012

కళ్ళ ముందే...

శ్వాస  కళ్ళ అగరొత్తి ధూపంలా గాల్లో కలిసిపోతూ... మిగిలిన చూపుల పరిమళాన్ని మూసేసిన అరచేతికి అంటుకున్న కనుపాపల వెలుగు కన్నీరులో నిమజ్జనం

ప్రేక్షకులు

Image
వీణ మెట్ల మీద వేళ్ళ నడక నాట్యమాడినట్లు కచేరి సాగింది అయిపోయింది మేము మటుకు కమలాన్ని చూస్తూ... చెరువు గట్టు దగ్గరే.....

సమాధి ఫలకం మీద అక్షరం

అమ్మ లేవలేని స్థితిలో వాళ్ళమ్మని కలవరిస్తోంది అమ్మమ్మ అమ్మ మూడొనెలలోనే పోయింది అమ్మ 1932లో పుట్టినట్ట్లు చెపుతుంది (ఖచ్చితంగా చెప్పలేం). అప్పటికీ ఇప్పటికీ జననం మరణానికి ధృవీకరణ పత్రం. నా జన్మస్థలం పై ఒట్టు. (ఉదయం 3.50,8-8-2012,బడంగ్ పేట)

గదిల్లు

Image
కిటికి తలంపులు మూసి తెరిచినట్టు పాటలు వినడం  ఇంటలవాటు. ----- ఇంటి ఆనవాలు గోడల్లో ఇంకిన వర్షపు ధారల నదిలత శిశిర చిత్రం. ---- నన్ను తరచూ అడిగే కుశల ప్రశ్నల్లో అమ్మ ప్రస్తావనకి నా జవాబు రండి  ఆమె  ఆవరణ  గదిళ్ళ తలుపుల శ్వాస సదా  అడుగిడే గడప గాలి