కిటికి ఆవలి జంబో నేరేడు

మా యిరువురి
మధ్యన వుండేది
అద్దాల కిటికి
దాని ఆకుల తివాచి
---
పలకరింపు
అద్దం నుండి
ఒకరి చూపుల్లోని పరిమళం
మరొకరి  పెదవుల పైన వికసించే నవ్వు
------
కరచాలనం
ఆకుల సవ్వడి
-------
మా మధ్యన తేడాలేమీ లేవు
కిటికీలు తెరిచి
గాలాకాశంలా
తెరుచుకునే  తీరిక తప్ప!

(5-7-2017)

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు