నవ్వారు
“నవ్వారు,నవ్వారు
కుర్చీలకూ,మంచాలకూ
మంచి నవ్వారు
సరస మైన తక్కువ ధరలకి
మంచి ఫ్యాన్సీ నవ్వారు
అమ్మబడుతుంది”!
అంటూ చెరువు గట్టు మీదున్న
మైసమ్మ గుడి దాటి
వెళ్ళిపోతున్నాడు.
నవ్వారు,నవ్వారు
చెట్టుకోళ్ళ నేల మంచంకి
వర్షం నవ్వారు.
ఆరు బయట
నులక మంచం పైన పడుకుని
హ్యాపీగా
సరసమైన ధరలకే!
పచ్చని కోరికలు మొలకెత్తే
ఫ్యాన్సీ కలల్నికనొచ్చు
రండి
కొందరి వద్దే లభించును!
(8-10-16)
Comments
Post a Comment