ఇంకా సగం
నా గది గోడలు
సగం విరిగినప్పుడు
అడవి పడవల కోరికలు
వాకిట్లో ముగ్గులవుతాయి
సగం నింగి
సగం నేల
సగం నీరు
తేలుతున్న సముద్రం ఇల్లు
అడుగు కింద
అడుగు పైన
సగం తెగిపడ్డ
మబ్బుల నురగ
జాలరి వల
దూరంగా
పడవ నీడలో
కూర్చున్న
ముసలి తాత
కలల ఉదయంలోని
చేపల మనసుకి
గాలికబుర్లు చెపుతూ...............
సగం కూలిన గోడ
సగం తెర్చుకున్న తలుపు
సగం తడిసిన ఆలోచన
సగం చిరిగిన తెరచాప
సగం తడవని తీరం
సగం నిండని తీరం
నీటి గోడ
మొగలి పొద దేహం
(నా మెదటి కవితా సంపుటి)
(14 -7-1997)
Comments
Post a Comment