సంపెంగ పూ రేఖల వాకిలి

జ్ఞాపకాల బోషాణ౦లో దాగడిపోయిన
ఆలోచనొకటి
మళ్ళీ దొరికినట్టు

చీకట్లో నేను వెతుకుతుంటే
పడుకునే వున్న ఆమె
అటు కాదు ఇటుఅంటుంది

మళ్ళీ
చీకటి పడుతున్న సమయం
వర్షపు చినుకులు మొదలవుతున్నాయి
రాత్రంత్రా నిక్కచ్చిగా కరెంటు కోత వుంటుంది
త్వరగా వచ్చేయండి

రాత్రి పొడుగునా వర్షం
అర్ధరాత్రి దాటిన తర్వాత  ఇల్లు చేరాను
మలుపు చివర్న వరకు సోకే   సంపెంగ పూల పరమళం
వెలుగు, చీకట్లలోను కన్పించే  ధూప కాంతిలా
గేటెదుటే నీటిమడుగులో
మబ్బుచాటున చంద్రుడు
అప్పుడే జలకమాడి  వెళ్ళినట్టు
అడుగులకు దీపకాంతిలా
నీటిలో వొక వెలుగు దివిటీని   
వదిలి వెళతాడు
ఇవి....
మా ఇంటి ఆనవాళ్ళు
మొక్కల గూటిలో
గూటి నుండి
గూటికి చేరే
దారి తప్పడం  
బహుకష్టం

ఈ మునివాకిలిలో
ఆనవాళ్ళు గుర్తులుగా ఎదుగుతాయి
చిరస్మరణీయ జ్ఞాపకాలుగా...


(12-8-2015,గుమ్మంలోని తెల్ల సపెంగ పూల చెట్టుకి)  

Comments

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

బంతి పూల భిక్షువు

శిశిర పిచుక-