వేర్లున్న చోట


నిన్న సాయంత్రం
కనుచూపు  కొసలో
సూర్యుడు  కొండల చాటుకి వెళుతున్నాడు
మైదానం  మొదట్లో
అతను జీవనానికి,
వంట చెరుకు కోసం
పడిపోయిన పెద్ద చెట్టుని నరుకుతున్నాడు
నేను  మా గోడమ్మటే
పార్క్ లో నాటిన చెట్లకి నీళ్ళు పోస్తూ...
అలసి పోయి ఖాళీ ప్లాస్టిక్ నీళ్ళ సీసాని, నా వైపు చూపిస్తూ
కొన్ని నీళ్ళిమ్మని సైగ చేశాడు
అతను వచ్చి,
కొన్ని నీళ్ళు తాగి,మరి కొన్ని సీసాలో పట్టుకుని,
వెళ్తూ, వెళ్తూ...
వెనుతిరిగిన
కృతజ్ఞత  చూపు,
2.
రాలిన పండు టాకు నీటిలో తేలుతున్నట్టు,
అప్పుడే గూటికి  చేరిన పక్షి
చెట్టుని పలకరించినట్టు
ఇద్దరి పెదవుల పైనా
ఎండిన  నేల నుండి ఉబికిన
తడి  గాలి జల్లుల
పరిమళపు నవ్వు,

3.
మట్టినంటిపట్టుకున్న  వేర్లు
ఖనిజమయ్యే  దారిలోకి సాగుతునట్టు
 (27--2౦15, ఇంటి వెనక పార్కు)

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు