కలోపదేశం

ఉచ్చ్వాస నిశ్వాసల  వూసు – ఊపిరి 
2
ఉచ్వాస నిశ్వాసల  వూసు - ఊపిరి
ఎండు మట్టికి
రుద్ర జడ గింజల సువాసన
గాలి కళ్ళల్లో ఇంకిపోతున్న
రాత్రి కల
బీడువారిన నేల రేఖల్లో
తుది శ్వాస
ఒడిలిన మొక్కకు వేలాడుతున్న
చమ్మలేని మిరప, టమాటో కాయలు,ఆకులు, కాండం
ఎరుపెక్కని పరిపక్వపు పచ్చని  రూపం
మొదలు ,చివర బిందువుల మధ్యన
కన్పించని
చూపుల గీతాసారం
3
ఉచ్వాస నిశ్వాసల  వూసు -ఊపిరి
ఆకుల శ్వాస కణాల్లో
చిక్కుకున్న మట్టి ధూళి
రేపటి అడుగు జాడ...
మట్టి సవ్వడి
4
ఉచ్వాస నిశ్వాసల  వూసు-ఊపిరి
మూడు రాళ్ళ పొయ్యి లో
తలకిందులుగా మొలకెత్తే
ఆకాశపు  నేలచుక్క

(22-2-15)

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

పిల్లల చెట్టు

గూళ్ళ రెక్కలు