Posts

Showing posts from March, 2015

వేర్లున్న చోట

నిన్న సాయంత్రం కనుచూపు  కొసలో సూర్యుడు  కొండల చాటుకి వెళుతున్నాడు మైదానం  మొదట్లో అతను జీవనానికి, వంట చెరుకు కోసం పడిపోయిన పెద్ద చెట్టుని నరుకుతున్నాడు నేను  మా గోడమ్మటే పార్క్ లో నాటిన చెట్లకి నీళ్ళు పోస్తూ... అలసి పోయి ఖాళీ ప్లాస్టిక్ నీళ్ళ సీసాని, నా వైపు చూపిస్తూ కొన్ని నీళ్ళిమ్మని సైగ చేశాడు అతను వచ్చి, కొన్ని నీళ్ళు తాగి,మరి కొన్ని సీసాలో పట్టుకుని, వెళ్తూ, వెళ్తూ... వెనుతిరిగిన కృతజ్ఞత  చూపు, 2. రాలిన పండు టాకు నీటిలో తేలుతున్నట్టు, అప్పుడే గూటికి  చేరిన పక్షి చెట్టుని పలకరించినట్టు ఇద్దరి పెదవుల పైనా ఎండిన  నేల నుండి ఉబికిన తడి  గాలి జల్లుల పరిమళపు నవ్వు, 3. మట్టినంటిపట్టుకున్న  వేర్లు ఖనిజమయ్యే  దారిలోకి సాగుతునట్టు   (27 - ౩ - 2౦15, ఇంటి వెనక పార్కు)

అంతర్ముఖం

బండి అద్దంలో పిచుక తన ప్రతిబింబాన్ని ముద్దాడుతో o ది నాలోని అద్దం గగన విహంగ మవుతుంది (12-3-15)  

కలోపదేశం

ఉచ్చ్వాస నిశ్వాసల  వూసు – ఊపిరి  2 ఉచ్వాస నిశ్వాసల  వూసు - ఊపిరి ఎండు మట్టికి రుద్ర జడ గింజల సువాసన గాలి కళ్ళల్లో ఇంకిపోతున్న రాత్రి కల బీడువారిన నేల రేఖల్లో తుది శ్వాస ఒడిలిన మొక్కకు వేలాడుతున్న చమ్మలేని మిరప, టమాటో కాయలు,ఆకులు, కాండం ఎరుపెక్కని పరిపక్వపు పచ్చని  రూపం మొదలు ,చివర బిందువుల మధ్యన కన్పించని చూపుల గీతాసారం 3 ఉచ్వాస నిశ్వాసల  వూసు -ఊపిరి ఆకుల శ్వాస కణాల్లో చిక్కుకున్న మట్టి ధూళి రేపటి అడుగు జాడ... మట్టి సవ్వడి 4 ఉచ్వాస నిశ్వాసల  వూసు-ఊపిరి మూడు రాళ్ళ పొయ్యి లో తలకిందులుగా మొలకెత్తే ఆకాశపు  నేలచుక్క (22-2-15)