గోళీలాట
చెట్లనీడల్లో
గోళీలు
ఆడుతున్నప్పుడు
రంగుటాకుల
గొడుగుల
కిరీటధారులం
వేళ్ళ వింటిబద్ద
నుండి
వెలువడిన
వెలుతురు పిట్టలం
రోజంతా
స్నేహితులం
కప్పల్లా
ఎగురుకుంటూ
వూరంతా
తిరిగొచ్చే
వాళ్ళం
సాయంత్రానికి
గెలిచిన గోళీలని
మట్టిలో
దాచుకుని
ఎవరిగూటికి
వాళ్ళు వెళ్ళే వాళ్ళం
రాత్రంతా
గోళీల్లోని
వెలుతురు పిట్ట
అరలోని చమురు
దీపంలా
నక్షత్రం
గూటినుండి
మమ్మల్ని చూస్తూ
వుండేది
ఇక ఇప్పుడు
ఎదిగిన తర్వాత
ఎండిన మోడు
గొంతు సీసాలో ఇరుకున్న
గోళీనయ్యాను
మిగతా
మిత్రులు...!
(12-6-14)
Comments
Post a Comment