పూల రెక్కలోని చిత్రం

నేను ఓ చెట్టుని
కౌగలించుకున్నప్పుడు
నాలోని వృక్షత్వం
నింగిలో తటాకమవుతుంది
నేను మటుకు సదా
పూల రేకుల్లా...
ఎండుటాకుల్లా...
వేర్ల మొదళ్ళలో
రాలుతూనే వుంటా
ఆమె అరికాళ్ళ రేఖలు
నా మీదుగా పయనించినప్పుడు
తొలకరికి
మట్టి చిట్లి
వివిధ రంగుల్లో విచ్చుకుంటుంది
ఆకాశం తన రంగుల వస్త్రాన్ని ఆరేసుకున్నట్లు
తడి
మట్టి
రాట్నం మీద
హస్తరేఖల్లా ముద్రితమవుతున్న చిత్రం
అంకురిస్తుంది

(9-6-14)

Comments

  1. బాగుంది ... సున్నితంగా సరళంగా

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

గోళీలాట

సమాధి ఫలకం మీద అక్షరం