కనుపాప కుండీ



ఇద్దరం కలిసి
మొలకల్ని నాటుతున్నప్పుడు
ఇరువురి కౌగిలింతప్పటి చేతి వేళ్ళ మధ్యన ఖాళీలో
చీకటి
వెలుగు
ఒకటవ్వడానికి
చోటు ఆవిర్భవిస్తుంది
సాంగత్యపు చూపులోని మౌన గీతం
ఎప్పటికీ
మట్టిలో
జీవకణంలా మిగిలిపోతుంది
(9-6-14)


Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

పిల్లల చెట్టు

గూళ్ళ రెక్కలు