రొట్టమాకుల తెప్ప



ఉదయం

దీప స్థంభం పైన
వాలిన పావురాళ్ళు
గమ్యం నిర్దేశించుకున్నాయి


ప్రయాణం 
ఆద్యంతం
సరంగు పాటల్లాంటి
కబుర్లు

ప్రయాణపు బడలిక
తీర్చిన ఆకాశ గంగ

రొట్టమాకు వాగులో  మజిలీ

ఓ మోనోలిత్ చుట్టూ
రాలిన ఎండుటాకుల మీద
సహచరుల్మంతా 
పాదముద్రల దస్తూరిని వదిలి
రెక్కలకు 
ఊరి మట్టి లేహ్యానద్దుకుని
తిరిగి గూటికి చేరాం

అప్పటికే
నిశాచర రోడ్లకి
వెలుతుర్లని పొదిగి
పావురాళ్ళు నిష్క్రమించాయి

మర్నాడు ఉదయం

పసుపచ్చని ఆకుల్లా
పావురాళ్ళు
నగర గాలికి
పచ్చిరొట్ట 
కబుర్లందించాయి
నింగి పాదాలకి పారాణి రంగంటుకుంది

తాజా తీర్మానం...


ప్రయాణం
గమ్యానికి, 
మొదటి, చివరి   అడుగుల  నడుమ
అయిస్కాంతపు రేఖల గగనం

రండి ఊరెండుటాకుల వ్యోమగామిలో
పయనించి వద్దాం
(రొట్టమాకు ప్రయాణంలో దారిపొడవున సహచరులైన వారందరికి)
(21-5-17)

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు