ఆవరణ
పొద్దున్నే
దేవగన్నేరు ఆకుల్లోని
వర్షపు చుక్కల కొలనులో
పిట్ట స్నానం చేస్తోంది
ఆమె నా మదిలో
ఈత కొడుతున్న సవ్వడి
కొమ్మలపైన
ఆకుల నీడల మీద
పిచుకల జంటల కేరింతలు
ఆకుల తంత్రుల నుండి ప్రవహించే లేత పచ్చని వెలుతురు పాటలు
ఇదంతా
నా ప్రహరీ గోడ వెలుపల
వాయుగుండం పిదప
ఏర్పడిన
వాతావరణం
మరి
సముద్రపు తీరప్రాంతంలో...
తలలు వాల్చేసిన
వరి చేలు
సముద్రపు అంచున
పుట్టిన
నేల
కలయిక,విడిపోయే
పక్షి గూటి చూపు
నింగి అలల నావ
నీటి మట్టి సారం
ఇదంతా
దేవగన్నేరు ఆకుల్లోని
వర్షపు చుక్కల కొలనులో
పిట్ట స్నానం చేసేలోపే
రెక్కల సవ్వడి గాలికి
ఏర్పడిన శ్వాస నిట్టూర్పు
(10-5-14)
Comments
Post a Comment