చౌకి
రాత్రి రెండు గంటలకు
చెట్లని చూస్తునప్పుడు
పట్నం నుండి
వస్తున్న
అభివృద్ధి నియోన్ కాంతి
అడవి గూటిని పెకలించడానికి వచ్చే
ఎలక్షన్ మ్యానిఫెస్టో నాలుకలాగుంది

ఆ మాయదారి నాలుక  గాలి 
తాకకుండా
సదా పహరా  కాసే
నిశాచర జీవాల్లా

చెట్లకల్లుకున్న
పక్షి జంటలు

కూస్తూనే వున్నాయి

అందుకే రాత్రప్పుడు
అందుకే రాత్రప్పుడు

పక్షి కూతలు వినపడతాయి


(21-4-14)

Comments

Popular posts from this blog

మేము,చిత్రిత కొంగ ,ప్రొక్లైనర్

సమాధి ఫలకం మీద అక్షరం

కిటికి ఆవలి జంబో నేరేడు