శిశిరం
గొంగళి పురుగు-
ఆకులకి బొత్తాలు కుడుతున్న
దర్జీ
----------
సీతాకోక చిలుక-
రంగుటాకుల దుస్తుల్ని
గాలికి అమ్మే
విదూషకురాలు
-------------
విరగ కాసిన ఛెట్టు కొమ్మ-
కొమ్మలకంటుకున్న
ఉసిరి పిందెలు
పసికందు పెదవుల పై
చనుపాల చుక్కలు
---------
చంద్రుడు
చీకటి కిటికీ కంటుకున్న
సాలీడు నేత్రం
(15-3-14)
--------
పున్నమి వెన్నెల
రాత్రంతా
వాంఛ నెగళ్ళు
ఉదయం
బూడిద పుప్పొడిలా
దేహనది
రంగుల హరివిల్లు
(15-3-14)
-------------
పున్నమి శిశిరం-
పసిడి కలల
బోసి నవ్వు
(17-3-14)
----------
శిశిరంలో పున్నమి దారి-
రాత్రి-
రహదారి చివర్న
వెలుగుతున్న సోడియం లైట్
ఉదయం
ఇంకా వెలుగుతున్న
దారిలోని స్ట్రీట్ లైట్
(18-3-14)
---------
ప్రయాణం-
ఎండుటాకుల దారిలో
మంచు బిందువుల చిగురులు
(18-3-14)
ఆకులకి బొత్తాలు కుడుతున్న
దర్జీ
----------
సీతాకోక చిలుక-
రంగుటాకుల దుస్తుల్ని
గాలికి అమ్మే
విదూషకురాలు
-------------
విరగ కాసిన ఛెట్టు కొమ్మ-
కొమ్మలకంటుకున్న
ఉసిరి పిందెలు
పసికందు పెదవుల పై
చనుపాల చుక్కలు
---------
చంద్రుడు
చీకటి కిటికీ కంటుకున్న
సాలీడు నేత్రం
(15-3-14)
--------
పున్నమి వెన్నెల
రాత్రంతా
వాంఛ నెగళ్ళు
ఉదయం
బూడిద పుప్పొడిలా
దేహనది
రంగుల హరివిల్లు
(15-3-14)
-------------
పున్నమి శిశిరం-
పసిడి కలల
బోసి నవ్వు
(17-3-14)
----------
శిశిరంలో పున్నమి దారి-
రాత్రి-
రహదారి చివర్న
వెలుగుతున్న సోడియం లైట్
ఉదయం
ఇంకా వెలుగుతున్న
దారిలోని స్ట్రీట్ లైట్
(18-3-14)
---------
ప్రయాణం-
ఎండుటాకుల దారిలో
మంచు బిందువుల చిగురులు
(18-3-14)
Comments
Post a Comment