ఆకుపచ్చని నీడ రంగులు

పాము తలకాయున్న గొంగళి పురుగు
ఆకులపై
డొల్ల ముఖచిత్రాల్ని గీస్తూ వుంటుంది

ఆ ముఖచిత్రాలనుండి ప్రసరించే సూర్య కిరణం తాకిన నేల
కాంతి విస్ఫోటనం నుండి
మొలకెత్తిన

సీతాకోక చిలుక

నాకళ్ళలోని ఆకాశానికి
రంగులద్దుతూ
పయనిస్తుంది

(18-3-14)

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు