మోదుగ చంద్రవంక

అర్ధచంద్రాకార కిటికీ అద్దం

రాలిన చుక్కతో
పడుకున్న నేను

ఆకులు పూలైన
మోదుగ వనంలా
ఓ నగ్నాకాశం


నేల వాంఛల 
పచ్చని పున్నమి 
వెన్నెలదారుల కలయిక 


మనస్సు  చూచుక కళ్ళలో 
ఒకే దృశ్యమైన
కనుపాప బీజం

(నా ప్రయాణంలో వెన్నంటే వుండి, వచ్చిన మోదుగ పూలకి)

(11-3-14)

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు