తెలుపు అంచు
మునిమాపు వేళ

కొమ్మల పైన

వాలిన కొంగలు


ఇక అకాశంలో

మరో కొంగ

నక్షత్రాల మధ్యన

విహరిస్తుంది


లాంతరు అద్దం పైన

వెలుగు

చెరసాల చువ్వలా

ఆమెని తలుచుకుంటూ

ఓ తెలుపు అంచు 

రెక్కల కోరిక కట్టినట్టు

(11-10-13)

Comments

  1. లాంతరు అద్దం పైన వెలుగు చెరసాల చువ్వలా...
    అందమైన ఉపమానం, అంతే అందమైన భావం,
    మీ చక్కటి శైలిని పొదుపుగా వాడుతారు చిన్న కవితగా..(నా బ్లాగ్ దర్సించగలరని ఆసిస్తూ)

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

మేము,చిత్రిత కొంగ ,ప్రొక్లైనర్

సమాధి ఫలకం మీద అక్షరం

కిటికి ఆవలి జంబో నేరేడు