లోలోన



నా లోకి రాత్రి
ఓ తడిసిన మట్టి నాలుక లా
జొరబడుతుంది

దేహమంతా
సుదూర అడవి  గొంతుకుల
ఆలాపనలా

రంగులేని కళ్ళలోన ఓ దివిటీ వెలుగు

నన్ను తట్టి లేపుతున్నట్టు

ఎవరో లాగా నా రూపం దాల్చి
నా దేహానికి నేనే ఆత్మని పొదుగుతా



నాలో నేనే
ఓ శరణార్ధిలా


గూడులోని
గుడ్డులోని పచ్చసొనలా
కనుల్లోని పగటి రంగుల
ప్రవాహంలా ప్రవహిస్తూ
లోలోనే బాహ్య ప్రపంచాన్ని అల్లుకుంటా

ఎటూ రాని రోజు కంటే

ఖచ్చితంగా వచ్చుండే చీకటికి

కొత్తనీరులో కలిసిన మట్టికి

చేప నేత్రాలతో
వెన్నెల సరంగులా
అటూ ఇటూ కదులుతూ .
నీటి గాలి బుడగలతో
ముచ్చట్లాడుకుంటా...
(27-10-13)


Comments

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు