అద్దాల పలుకులు
ఛోటూ మంచం పైన
కింద నవ్వారు మంచం ఊయలల్లోలా
నేనూ తనూ
చాప మీద పడుకుంటాం
కిటికి అద్దాల నుండి
దోబూచులాడుతూ
చంద్రుడు
కిటికి
అరుగుమీద మొక్కలు, చెక్క బొమ్మలతో
కబుర్లు చెప్పుకుంటూనే
రాత్రిని గడిపేస్తాడు
పొద్దున్నే పక్షులు
కిటికి అద్దాలను తడుతూ
రాత్రి ముచ్చట్లు తెలిసిపోయాయన్న
ఆనందంతో
చప్పట్లు కొడతాయి
(4-8-13)
Comments
Post a Comment