మోదుగ పూల చెట్టు



నేల రాలిన పూలు 

నింగి  నుండి 

జారిన  సూరీడు 

ఈ  రాత్రి 

చెట్టు కింద 

నిద్రోతా  

పున్నమి వెన్నెల  

నిలువునా 

దహించి  వేస్తుంది 

పగలు 

ఆకాశం

నా దేహ కాంక్ష   రంగుని  

పులుముకుంటుంది 

మట్టి మంచం 

ఇంకా  రగుల్తూనే  

వుంటుంది 
(3-4-13) 

Comments

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు