సోనే కీ ఆవాస్
పసి గొంతునుండి
వస్తున్న
కిస్ మోడ్ సే ఆయే హైన్ పాట...
తన్మయత్వంతో మూసుకున్న కళ్ళు
కళ్ళు తెరిచింతర్వాత తెల్సింది
కళ్ళకి అద్దాలున్నాయని
ఆ గొంతు
ఏ దిశగా వచ్చిందో...
ప్రేమ లోని ఎడబాటుతనానికి
పసితనపు తడి అద్ది వెళ్ళింది
పిల్లల గొంతులు
ప్రేమ జాడలన్నీ కలిపే
తెలుపు కూడళ్ళు
తెరిచిన తర్వాత
కళ్ళలో...
అద్దాల్లో
అరచేతి పాలెట్లో
మనసు రంగుల్ని
కలుపుతూ
చిన్నారి గొంతుని
స్మరిస్తూ
పాట
మ్యూరల్ని
చిత్రిస్తూ
ఇలా...
కిస్ మోడ్ సే ఆయే హైన్,
కిస్ మోడ్ సే జాయేంగే...
(సోనాక్షి ఖేర్ కి)
(2-6-13)
Comments
Post a Comment