పచ్చటి ధనంకొన్నిళ్ళలోకి

వెళ్ళగానే

ముందుగా గేట్ తెరవాలి


చాలా కొన్నిట్లోకి మట్కు

పచ్చదనపు హరివిల్లులనుండి

లోనికి వెళ్ళాలి


వచ్చేసిన తర్వాత

పచ్చటి వెలుగు ఙ్ఞాపకాలు

వెంటాడుతూనే వుంటాయి


ఆ ఇంట్లో వాళ్ళకి మటుకు

ఇల్లొదిలి  వెళ్తే

ఇంట్లోని వస్తువులమీద బెంగ కంటే

ఇంట్లోని జీవాల మీద దిగులెక్కువ


ఇళ్ళు

జీవమున్న 

మట్టి పుట్ట గొడుగులు


(వంశి,దాక్షాయని గార్కి,వారి ఇంటికి మా ఇంటికి వున్న  సహచర్యానికి)

(18-6-13)

Comments

Popular posts from this blog

మేము,చిత్రిత కొంగ ,ప్రొక్లైనర్

సమాధి ఫలకం మీద అక్షరం

కిటికి ఆవలి జంబో నేరేడు