లిపి లేని భాష



నేల భాష పలుకులన్నీ...

వేరు కంటిన మట్టి  నుండి 
మొలకెత్తే
పచ్చటి తడి 
మట్టి పుట్ట 
ఉమ్మనీటి వాగులు

ఆ పొరల కళ్ళజోడుతో
ఆకాశాన్ని చూద్దాం 
నింగి లోని రంధ్రానికి
మట్టి బొట్టు
పచ్చటి కవచమవుతుంది

మబ్బు నీడ
గిరికి గొడుగవుతుందన్న
అంతరిస్తున్న లిపిలేని మాట
మట్టి పలక మీద
ఆకాశ వాణవుతుంది
(24-5-13)

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు