హనీ డ్రాప్స్


నక్షత్రాలు
ఆకాశంలోని
చివరి మిణుగుర్లు
సీసాతో
కబుర్లు చెప్పుకుంటా
నాలోని జీని తారతో
మంత్ర తివాచిపై విహరిస్తా

ఉదయం 
చివర్లో
సెలవుతీసుకున్న జీవాత్మలా
జేబులోనుండి
జారిన  దుడ్లన్నీ
దుప్పటికంటుకుని... 

నిప్పులోని ఈల పాట 
మళ్ళి రాత్రికి
చుక్కల్ని తెచ్చిస్తుంది! 


ప్రతి రోజూ
బొతల్ సముద్రంలో తేలి
నాకు చేరాల్సిందే
నేను
నింగి ఒడ్డున
నీటి ఘోస్టికి గేలం వేసే 
జాలర్నే
6-2-13
(చాలా కాలం తర్వాత ,గుల్జార్ ,బొతల్సె ఏక్ బాత్ చలి హై పాట ఙ్ఞాపకం వచ్చి)


Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు