నిద్రించని చెట్టు


రాత్రప్పుడు
చెట్ల కింద
పడుకోవద్దన్న
నమ్మకం వుంది
అవి మీద పడతాయట

నగరంలో
నిద్రలేమి
సాలె పురుగు
గూట్లో కంటే

శిశిరంలో
పోడప్పుడు
చేను మకాంలో
నక్షత్రాలని
లెక్కెడుతూ
మిణుగుర్లని
విత్తుతూ
వుండిపోయా
ఛెట్టు రాలలేదు
కానీ
అడవికి
వెలుగునిచ్చే
మోదుగ పూచింది
వసంతానికి
నాంది గా 
చుక్క రాలి
రెల్లు గుత్తు
పొడిచింది

రాత్రప్పుడే
చెట్టు అకాశంలో
ఆకుల నక్షత్ర గుచ్ఛం

అవి పువ్వులై
రాలుతాయి
వాటి చెంతనే
నిద్రిస్తా
ఆకుల్లోని
సవ్వడి
చేయని
మంచు తేనె
తీర్థాన్ని
చివరాఖరివరకు
ఆ తర్వాత
ఆస్వాదిస్తా

పోడు భూమిలో
గింజకి
కావలి కంచయిన 
చెట్టు
సదా
పంటనిచ్చే
కొత్త పండుగ!
(30-10-13)

Comments

Popular posts from this blog

గూళ్ళ రెక్కలు

పిల్లల చెట్టు

మదర్ ఎర్త్