ప్రసవం
కాలం
గడియారం ముల్లు
ఊయ్యాలలో
కోరిక తీరని ఆత్మలా పరిభ్రమిస్తుంది
నా మటుకు నేను
దాని ఘడియల్ని
రోమన్ లేక ఆంగ్ల అంకెల్లో
లెక్కిస్తూ
నా రాత
వయస్సుకి కాలం చిగురించదు
మోడు వారదు
బహుశా
కాలాన్ని లెక్కించే
మారిన యంత్రాల
సూదుల వాడికి
నా రక్తం రుచించదేమో!
ఒక్కప్పుడు ముచ్చట్లతో
కాలం స్తంభిచేది
ఇప్పుడు
నా కాలం నా అవయవాల ఆవరణలోనే
బందీ అయ్యింది
ఇకపై
ప్రతి వారం చివర్న
నలుగుర్ని
కల్సి కాలక్షేపం
చేస్తా
వీలైతే
ఆ చావడికి మీరూ
రండి
కొద్ది సమయాలు
పురుడు పోసుకుంటాయి
(2-1-13)
Comments
Post a Comment