బంతి పూల భిక్షువు
బంతి పూలు
రంగుల వర్షపు చుక్కలు
వాటి
పరిమళం
ఆమె వోర కంటి
పెదవులొడ్డున
వూగిసలాడె
చిరుహాసం
మంచుపొరల్లోని
క్రీగంటి చూపుల
నెగళ్ళ సెగలా
అక్కడే
సంచరించే
ప్రార్థనాలాపన
భిక్షువుని
...
అనుగ్రహం
వాడినబంతి రెక్క
రాలి
పుడమి వాకిళ్ళకి
పారాణి
అద్దింది
...
బంతిళ్ళు
అరచేతులకంటిన నేలసిగ పూలధూళి ముద్రలోని కాంతి రేఖలు
భిక్షువుల ధ్యాన మందిరం
సడి చేయని మంచు బిందువుల మౌన గుహ
(16-1-13,మాధవికి, మా బంతి తోటకి)
తాజా బంతి పూల పరిమళం సార్..
ReplyDeleteచాలా బాగుంది..
thanks verma gaaru
Delete