ఫెంచ్ (గాలి పటాల పోరు)


కరెంటు తీగలకు
వేలాడుతున్న గాలి పటంలా
ఈ రోజు
నెలవంక
నా కనుగుడ్డు
కొసనే  వుంది
మనస్సు దారంతో చిక్కడిన
పండగ చివర్న మిగిలిన
పతంగిలా
నా గూట్లోనే
ఆకాశ మార్గాన్ని
దుప్పట్లో
పొదిగిన కలలా
ఒదిగిపోతుంది

ఈ ఏడాది
మా వాడు
పండగకి
వూరెళ్ళాడు
గాలి పటాన్ని
గదిలో వదిలి

ఇంట్లో 
నేనూ
మాధవి
తెగిన
గాలి పటాల
దారంలా 
నేలకి ముడిపడి
నింగిని
కళ్ళలో
ఎగరేసుకుంటూ...
(15-1-13)

Comments

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

గోళీలాట

సమాధి ఫలకం మీద అక్షరం