ప్రతిబింబం (సీక్వెల్)
పక్షులు
ముక్కున తీసుకున్న
గరిక పరకల్లా
నేను
రోజూ
కొన్ని అక్షరాల్ని
ఏరుకుంటా
ఇంటిని
అక్షర మాలగా
కూర్చాలని
ప్రయత్నం
చేస్తుంటా
వాటి కాలం వేరు
పరిణతి చెందినవి
నా మటుకు
తరచు
చేయాల్సిందే
అందుకే
పెరటి నిండా
మొక్కలే
ఇంట్లో కూడా
అవి ఇంటి సభ్యులవ్వాలని
మా యత్నం
సదా కొనసాగే
అలవాటుగా
మారాలని
ఎప్పటికైనా
ఇల్లుని
కవిత్వ పొదరిల్లుగా
అమర్చాలని.
రోజూ
ఉదయం
పిట్టలు
బయటకు
వెళ్ళే
ముందు
కిటికీ
తట్టి
మరీ
గుర్తు చేస్తాయి
లోనా
బయటా
నేల చీరని
పచ్చగా
అమర్చమని
గూళ్ళని
కళ్ళలో
పెట్టుకుని
చూడమని
మీ పరిమితిలో పరిధిలో ప్రక్రుతి పరి రక్షణా యోచానాలోచనలు భవ్యం డియర్ సత్య...నూతక్కి( కనకాంబరం)
ReplyDeleteThanks sir, ide pani kada...
ReplyDelete