Posts

Showing posts from April, 2011
Image

జగబంధు

జగబంధు కోడి కూసింది తెల్లరే సూర్యుడు రంగుపులుముకోకుండా నల్లగొంతు కూతలా కనిపించాడు జగబంధుకి ఇవేవి తెలియవు నలుపుతెలుపు కలలా... బొమ్మలు వేయడం వచ్చు ఉదయం చీకటి రంగు మారుస్తుంది జగబంధు కోడిలా... (బాలమిత్ర విద్యార్ది జగబంధుకి, 7-4-2011

"ఇంకా సగం" సీక్వెల్

ఇల్లు సర్ద్దుకుంటుంటే మర్చిపోయిన నా "ఇంకా సగం" దొరికింది మిత్రులతో కబుర్లు నెమరేసుకోవచ్చు పాతమాటల్ని కొత్త చేయొచ్చు ఇప్పుడు పుస్తకాల అరల్లో "ఇంకాసగం" చోటుచేసుకుంది ఇంట్లోకి స్థలం వచ్చినట్లు 1-4-2011

దార్లు

నిన్న తాకేంత దగ్గరలో వున్నాడు ఈ రోజు ఆమడ దూరంలో ఎర్రబడ్దాడు కలిసిపోడానికి వచ్చాడు కిటికీలోనుండి వీధి దీపంలా కనబడ్డాడు చీకటిలోంచి చెయ్యి వూపినా వాడికి కనిపించలేదు గడ్డి పువ్వు వెదురాకు మంచుచుక్క మిణుగు వెలుగు  వచ్చివెళ్ళిన జాడల  పలకరింపు వాడు దూరంగానూ లేడు నేను దగ్గరా... కాలేదు దార్లు కలుస్తున్నాయి రాయాలనిపించింది (మాధవి,ఛోటూ-లకు) 20-3-2011