దార్లు
నిన్న
తాకేంత దగ్గరలో
వున్నాడు
ఈ రోజు
ఆమడ దూరంలో
ఎర్రబడ్దాడు
కలిసిపోడానికి
వచ్చాడు
కిటికీలోనుండి
వీధి దీపంలా
కనబడ్డాడు
చీకటిలోంచి
చెయ్యి వూపినా
వాడికి కనిపించలేదు
గడ్డి పువ్వు
వెదురాకు మంచుచుక్క
మిణుగు వెలుగు
వచ్చివెళ్ళిన
జాడల
పలకరింపు
వాడు దూరంగానూ లేడు
నేను
దగ్గరా...
కాలేదు
దార్లు కలుస్తున్నాయి
రాయాలనిపించింది
(మాధవి,ఛోటూ-లకు)
20-3-2011
Comments
Post a Comment