బాగుంటుంది

కొద్దిగా దగ్గరగా...
కొద్దిగా దూరంగా...

చోటు లేకుంటే
బాగుంటుంది
మనసుమాటకి
కావల్సినంత
కాలముంటుంది


కలలకి
నిద్రలేకుంటే
బాగుంటుంది
కళ్ళకి
కబురులుంటాయి


కలయికప్పుడు
చూపు లేకుంటే
బాగుంటుంది

తనువుకి
విరహస్పర్స
చర్మమవుతుంది


 రోజూ
కలవకపోతే
బాగుంటుంది
ఆలోచనలతో
ఆకాశం రంగులు అద్దుకుంటుంది


కొద్దిగా దగ్గరగా...

కొద్దిగా దూరంగా...
లేకుంటే
బాగుంటుంది


 చెట్టు నీడని
కౌగిలించుకుంటుంది

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు