1. నిశ్శబ్దం మబ్బుగోడ దేవుడు,గుడి, గంట, ఎప్పుడూ ఒకటితో ఒకటి మాట్లాడవు నాప్రార్ధన కూడా నాతోనేను మాట్లాడుకోవడం నీమౌనంతో మాట్లాడే భాషని కల్పించు మాట శబ్దం వాగ్గేయం మౌతుంది 2. నువ్వు,నేను మీరు అందరూ మాట్లాడుతున్నారు కొందరు గొంతుతొ, కొందరు గొంతులో కొన్నిపెదవులు కదులుతున్నప్పుడు కళ్ళూ, చెవులూ మట్లాడుతూవింటాయి 3. వయస్సు చివరంకంలో ఒకపార్కు బెంచిపైన కలం కాలాన్ని నెమరేసుకుంటోంది... ఏ చెట్టూ,పుట్టా గూడూ,వాగూ, వంకా,ఫక్షి నెమరేసుకున్నది చూడలేదు చేశానూ,చేయలేదు అదితప్పు,ఇదిఒప్పు యేదొపొరపాటున జీవితం గడిపినట్టు అంతా తూచ్చ్... చెట్టు నాటాను పండు నువ్వు తిను 4. నువ్వుమారావు నేనూమారాను నువ్వు,నేను కలిసి మారాం అయినా ఎవరిదారివారిది అప్పుడప్పుడు కలిసినప్పుడు తెలిసినవాళ్ళలా వుందాం కరచాలనం చేసుకుందాం మనపరిమళం కలయిక గంథం మవుతుంది (10/9/2010,విశాఖపట్నం)