మదర్ ఎర్త్

 

వూరవతలి ఇల్లు

వాకిట్లో, వీధిలో

ఇంట్లో

అంతటా మొక్కలు,చెట్లు

గదిలో మొక్కల్ని

తరచుగా

వాటి ప్రదేశాల్ని మారుస్తాను

గోడలకి

రుతువుల  పూలరంగులు

అద్దుకుంటాయి

వాకిట్లో

పక్షుల గూళ్ళు

చిగురిస్తాయి

 

నేల గంధం

గాలి పువ్వు

పరిమళం

 

ఇక

వాటి వూసులు

అమ్మ జ్ఞాపకాల్లా

ఇంటి ఆనవాళ్ళు

 

ఇల్లు

నేల నింగి గడపకున్న

సింధూర లంగరు

(21-4-2023)

Comments

  1. ప్రకృతి మీద మమకారం అణువణువూ తొణికిసలాడింది.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు