వేకువ పాట

 

 

 వాకిట్లో

రేయింబవళ్ళూ రాలే నక్షత్రాలు

సంపెంగ పూల రెక్కలు

ఉదయం

గాలి

నింగి నేల మధ్యన వూగే

పరిమళ అలల నది

సాయంత్రం

వాకిలల్లుకున్న పూలరెక్కలు

పాదముద్రల లంగర్లు

 

--

వెలుగు చుక్క

చీకటి గూటికి చేరేటప్పుడు

గడపెదుటున్న పూల వెలుగు తారల్ని

పోగు చేస్కుంటాను

వాట్ని వైతరణి

పాత్రలో  పోసి

కిటికీలో పెడతాను

రాత్రంతా 

మా మేనులు

పచ్చిక పైన

మంచు బిందు మేళనాలు

మళ్ళీ ఉదయాన

తడి సింధూర సముద్రం

ఎల్లల్లో మేల్కొంటాం.

 

అప్పటికే బుల్ బుల్  పిట్ట

ముఖద్వారం ఎదుటనున్న

పసుపు పచ్చ పూల తోరణంలోని గూట్లో

నోరు తేర్చుకుని వున్న

పిల్లలకు

ఎంగిలి బువ్వ పెడుతుంటుంది

కిచ..కిచ...

సుప్రభాతంతో

సూర్యుడు

మిన్నేరుతో  ఇల్లలలికేస్తుంటాడు

(గడపెదుట  బుల్ బుల్  పిట్ట గూటికి, దాని పిల్లలకు, 6-5-2021)

 


 

 

 

 

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు