మాల్
మా ఇల్లు
పిచ్చుకలకు,పక్షులకు అంగడి
రోజూ ఉదయమే
మొక్కలకి నీళ్ళు పోయడానికి
సూర్యకాంతి కోసం
కిటికీ,తలుపులు తెరుస్తాను
అప్పటికే
గూళ్ళుకట్టుకోడానికి,
ఇంటికి కావాల్సిన సరుకులు వాటంతట అవే
తీసుకేళుతుంటాయి...
వాటి కూతల శబ్ధంతో
మా ఇంటి గల్లా పెట్టి నిండుతుంది
(4-5-2020)
Comments
Post a Comment