కిటికీ రెక్క
సాయంత్రం
పక్షులు గూటికి చేరిన సవ్వడి
కిటికీలు మూసేశాను
నల్లటి కిటికీ అద్దంలో
చెట్టు చాటునుండి సూర్యుడు అస్తమయం
ఉదయం
మసక చీకట్లో
కనిపించని పక్షుల కూతలు
కిటికీలు తెరిచాను...
కిటికీ రెక్క
రేయింబవళ్ళ రాకపోకలను
పలకరించే
పక్షులకూత
(4-4-2020)
Comments
Post a Comment