ఏదేమైనప్పటికీ...



రోడ్లని మాత్రం
తిన్నగా నిర్మించాం
‘పట్టాలతో బాటు
రోడ్లనీ చదువుకున్నాం
మీ వూరికి
రోడ్డుందా!
అని కుశలమడిగాం
రోడ్లకి ఓపిక ఎక్కువ
కిక్కిరిసిపోయినా కిక్కురుమనవు
వేగాన్ని అదుపుచేయడానికి
మలుపు తిరుగుతాయి
పండగలు
పబ్బాలు
బైఠక్ లకూ,అన్నిటికీ
అడ్డాలవుతాయి
ఇల్లు వదిలిన దారిద్ర్యానికి
కాళ్ళవుతాయి
రోడ్డెమ్మటే
చెట్లతో బాటు
రోడ్లకి ఇల్లుంటే బాగుండు
ఏదో పోగోట్టుకున్నదిలా వుండదు
మనని పలకరించే
నియాన్ కాంతి  గొట్టం
నవ్వుతున్నట్టు౦టుంది
ఏదేమైనప్పటికీ...
రోడ్లు ఎదిగాయి
వలస పక్షుల గూళ్లయ్యాయి
చెదిరిపోతున్న సంబంధాలకు
‘సెల్ ఫోన్ లయ్యాయి .
(98)



Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు