కొన్ని హిందీ కవితల అనుసృజన
మబ్బుల చాటునుండి
వస్తున్న చంద్రుడు
ఎవరినైనా వెతకడానికా,లేక
తనని తాను ప్రదర్శించుకోడానికా!
(6-6-96)
-
తిరుగుతున్న
ఆగిన సైకిల్ పెడల్స్
తాడు లేని బొంగరం
(7-6-96)
-
నాల్గు మాటల కోసం
నాల్గు గోడలు
మనసులోని మాట
పెదవుల పై
బందీ అయ్యింది
-
నదిలో వెన్నెల
కాగితపు పడవా
లేక అందని ప్రేమలేఖా!
(96)
Comments
Post a Comment