పూలు - పండ్లు
నేల పైన
రాలిన వేప పూలు
పసి పిల్లల
తప్పటడుగుల ఆనవాళ్ళు
(6-4-2020)
-
నింగిని తూర్పారపడితే
రాలిన నక్షత్రాల కాంతి
చెట్టు నేల చెంతన
కానుగ పూలు
(8-4-2020)
-
చెట్టు పై నుండి
ఎగిరే పక్షి రెక్కల చప్పుడు
నేల పై రాలిన
ఉసిరి కాయలు
వాకిలి
మువ్వల చెట్టు
(9-4-2020)
-
దానిమ్మ పాదులోని నీళ్ళల్లో
తేలుతున్న
మునగ పూలు
నింగి గదిలో
ఆమె రాక కోసం
తచ్చాడుతున్న చంద్రుడు
(10-4-2020)
Comments
Post a Comment